టాలీవుడ్ డ్రగ్స్ కేసులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 12 మంది సెలబ్రిటీలకు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం పూరీ జగన్నాథ్‌ని 10 గంటల పాటు విచారించారు. పలు కోణాలలో పూరీని విచారించినట్టు తెలుస్తుంది.ఇక గురువారం ఛార్మీని ఈడీ విచారించింది. ఆమెని 8 గంటల పాటు ప్రశ్నించగా, అవసరమైతే మరో సారి తాను విచారణకు హాజరు అవుతానని పేర్కొంది.
Actor Rakul Preet Singh arrived at ED office in #Hyderabad for questioning in money laundering and drugs case.#DrugsCase pic.twitter.com/jOVMqdcX2E
— Aneri Shah (@tweet_aneri) September 3, 2021
ఇక ఈ రోజు రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ విచారణకు హాజరైంది. చార్టెడ్ అకౌంటెంట్, న్యాయవాదితో కలిసి రకుల్ ఈడీ ఆఫీసుకు చేరుకుంది. డ్రగ్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో రకుల్‌ని ప్రశ్నించనున్న ఈడీ.. ఆమె బ్యాంకు అకౌంట్లను పరిశీలించనుంది. ఈ నెల 6వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ముందు రకుల్ హాజరుకావలసి ఉంది. అయితే వరుస షూటింగులతో తాను ఫుల్ బిజీగా ఉన్నానని చెప్పిన ఈ స్టార్ హీరోయిన్.. తనకు కొంత గడువు ఇవ్వాలని అడిగిందట.
కాని గడువు ఇవ్వమని చెప్పిన ఈడీ ఈ రోజు రకుల్‌ని పిలించినట్టు సమాచారం. ఈ అమ్మడిని ఎన్ని గంటల పాటు విచారిస్తారు. ఏయే విషయాలపై ఆమెను ప్రశ్నించనున్నారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు 8న రానా ఈడీ విచారణకి రానున్నారు.