Raju Weds Rambai | చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని నమోదు చేసిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించడానికి సిద్ధమైపోయింది. తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఇదే చిత్రం డిజిటల్ ప్లాట్ఫామ్లోకి అడుగుపెట్టింది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ (ETV Win)లో ఈ చిత్రం ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. విడుదలైన వెర్షన్ కంటే అదనపు సన్నివేశాలతో కూడిన ‘ఎక్స్టెండెడ్ కట్’ (Extended Cut)ను ఓటీటీలో విడుదల చేశారు మేకర్స్. కేవలం రూ. 2.5 కోట్ల స్వల్ప బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం, ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడమే కాకుండా ఎమోషనల్గానూ ఆకట్టుకుంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 21 కోట్ల నుంచి 22 కోట్ల వరకు వసూళ్లు సాధించి 2025లో ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇల్లాందు ప్రాంతంలోని ఒక చిన్న గ్రామంలో బ్యాండ్ మేళం వాయించే రాజు (అఖిల్ రాజ్), కాలేజీకి వెళ్లే రాంబాయి (తేజస్వి రావు) మధ్య సాగే ప్రేమాయణమే ఈ సినిమా. వీరి ప్రేమకు రాంబాయి తండ్రి వెంకన్న (చైతు జొన్నలగడ్డ) అడ్డుపడటం, సామాజిక అంతరాలు, పరువు ప్రతిష్టల నేపథ్యంలో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. అఖిల్ రాజ్ ఉద్దెమరి, తేజస్వి రావు, చైతు జొన్నలగడ్డ, శివాజీ రాజా, అనిత చౌదరి తదితరులు. ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు దర్శకత్వం: సాయిలు కంపాటి. నిర్మాణం వేణు వుడుగుల.
STREAMING NOW 🚨
Theatres lo create chesina chaos…
📺 ippudu mee screens lo full blast.Raju Weds Rambai – EXTENDED CUT
Dolby Atmos & Dolby Vision
Press play.
Let the house shake.@venuudugulafilm @rahulmopidev @Monsoontal2444 @TheBunnyVas @connect2vamsi @akhilrajuddemari… pic.twitter.com/ZHpahO2MoO— ETV Win (@etvwin) December 17, 2025