తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందిస్తున్న ప్రేమకథా చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. వరంగల్, ఖమ్మం సరిహద్దు గ్రామాల్లో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది. అఖిల్, తేజస్వి రావు జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయిలు కంపాటి దర్శకుడు. వేణు ఊడుగుల నిర్మిస్తున్నారు. గురువారం ట్రైలర్ను విడుదల చేశారు. సున్నితమైన హాస్యం, ఆలోచింపజేసే మాటలతో కల్మషం లేని ప్రేమకథతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.
ఈ సినిమా ైక్లెమాక్స్ గుండెలకు హత్తుకునేలా ఉండబోతున్నదని, 15ఏళ్లుగా దాచబడిన నిజమైన ప్రేమకథకు రూపమని, ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలకు మంచి ఆదరణ దక్కుతున్నదని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రాన్ని నిర్మాత వంశీ నందిపాటి థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.