Rajkummar Rao – Patralekhaa | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయోగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ హాజరయ్యాడు. తన భార్య పత్రలేఖతో కలిసి ప్రయాగ్‌రాజ్‌కి వచ్చిన రాజ్ కుమార్ మహా కుంభమేళాలో పాల్గొన్నాడు. అనంతరం త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు రాజ్‌కుమార్.
సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల స్త్రీ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు రాజ్‌కుమార్. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ జంటగా నటించిన ఈ సినిమా దాదాపు రూ.800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం టోస్టర్ (Toaster) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సన్యా మల్హోత్రా ఇందులో హీరోయిన్గా నటిస్తుండగా.. వివేక్ దాస్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నాడు.
మరోవైపు మహా కుంభమేళాకు (Maha Kumbh Mela) భక్తులు (devotees) పోటెత్తుతున్నారు. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 40 కోట్ల మంది భక్తులు నదీ స్నానాలు ఆచరించారు. ఫిబ్రవరి 8వ తేదీ వరకూ 40 కోట్ల మంది భక్తులు త్రివేణీ సంగమంలో స్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు.
Maha Kumbhamela
Raj Kumar rao