ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఆధ్యాత్మిక చింతన ఎక్కువనే విషయం తెలిసిందే. ప్రతీ ఏడాది ఆయన విధిగా హిమాలయాలను సందర్శిస్తుంటారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఓ సాధారణ యాత్రికుడిగా ఆయన ప్రయాణం చేస్తారు. సోమవారం రజనీకాంత్ బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఆదివారం రిషికేష్‌లోని స్వామి దయానంద ఆశ్రమాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన రోడ్డు పక్కన నిల్చొని భోజనం చేశారు.
విస్తరాకుల్లో ఆయన ఆహారం తీసుకుంటున్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. సూపర్‌స్టార్‌గా అలరారుతున్న రజనీకాంత్ ఓ సామాన్య వ్యక్తిలా రోడ్డు పక్కన ఆహారం తీసుకోవడం ఆయన నిరాడంబరతకు నిదర్శనమని, సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ తలైవా అంటూ నెటిజన్లు ఈ ఫొటోలపై ప్రశంసలు కురిపించారు.