Power House | సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘కూలీ’ చిత్రం నుంచి తాజాగా ‘పవర్‌హౌస్'(Power House) అనే మూడవ పాట విడుదలైంది. ఈ పాట లిరికల్ వీడియోను హైదరాబాద్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో గ్రాండ్‌గా విడుదల చేశారు మేకర్స్. ఈ ‘పవర్‌హౌస్’ పాటకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించడమే కాకుండా, అరివు(Arivu) తో కలిసి ఆలపించారు. మాస్ బీట్స్, ర్యాప్ స్టైల్‌తో ఈ పాట శ్రోతలను ఉర్రూతలూగిస్తోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సాధించి, చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పటికే ఈ సినిమా నుండి “చికిటు”, “మోనికా” అనే రెండు పాటలు విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెకెక్కుతున్న ఈ భారీ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతి హాసన్, అమీర్ ఖాన్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పూజా హెగ్డే ఒక ఐటెం సాంగ్‌లో నర్తించనున్నారని తెలుస్తోంది. కళానిధి మారన్ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.