Vettaiyan | టీజే జ్ఞానవేల్( TJ Gnanavel ) దర్శకత్వంలో రజనీకాంత్( Rajinikanth ) హీరోగా తెరకెక్కుతున్న మూవీ వేట్టాయాన్( Vettaiyan ). ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, రానా, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో వేట్టయాన్ సినిమాలోని తొలి పాట మనసిలాయో(లిరికల్ వీడియో)ను సోమవారం విడుదల చేశారు. చెన్నైలో జరిగిన ఓ బూటకపు ఎన్కౌంటర్ ఇతివృత్తగా ఈ సినిమాను రూపొందించారు.
ఈ పాట కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో దివంగత గాయకుడు మలేషియా వాసుదేవన్ గాత్రాన్ని రీ క్రియేట్ చేశారు. దీప్తి సురేశ్, యుగేంద్రన్, అనిరుధ్ ఈ పాటను ఆలపించారు. అయితే రజనీకాంత్ – వాసుదేవన్ కాంబోలో వచ్చిన సింగం ఒండ్రు(అరుణాచలం), ముత్తమ్మ, మల్లిగై పువుక్కు(ఊర్కావళన్), ఒత్తడి ఒత్తడి(ధర్మత్తిన్ తలైవా) లాంటి పాటలు అప్పట్లో సూపర్ హిట్ కొట్టాయి. వాసుదేవన్ కోలీవుడ్‌లోనే ఎక్కువగా పాటలు ఆలపించారు. వాసుదేవన్ దర్శకుడు, మంచి నటుడు కూడా. అనారోగ్యంతో 2011లో వాసుదేవన్ మరణించారు.
ఇవి కూడా చదవండి..
KA | కిరణ్ అబ్బవరం క టీంకు దుల్కర్ సల్మాన్ సపోర్ట్
Dulquer Salmaan | దుల్కర్ సల్మాన్-రానా కాంబో సినిమా లాంచ్.. వివరాలివే
Jr NTR | ఒకే ఫ్రేమ్‌లో సందీప్ రెడ్డి వంగా, జూనియర్ ఎన్టీఆర్ .. స్పెషలేంటో మరి..!