Dulquer Salmaan | మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ఇప్పటికే లక్కీ భాస్కర్ సినిమాతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఈ సినిమా విడుదల కాకముందే మరో ప్రాజెక్టును లైన్లో పెట్టి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటిస్తోన్న చిత్రం కాంథ. ఈ మూవీ నేడు గ్రాండ్‌గా లాంచ్ అయింది. హీరోహీరోయిన్లపై వచ్చే మొదటి సన్నివేశానికి వెంకటేశ్ క్లాప్ కొట్టాడు. మల్టీ లింగ్యువల్ ప్రాజెక్ట్ షూటింగ్ కూడా షురూ కాగా.. ఇందులో మిస్టర్ బచ్చన్ ఫేం భాగ్యశ్రీ బోర్సే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
1950స్ మద్రాస్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సమకాలీన భావోద్వేగాల నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నాడు. స్పిరిట్ మీడియా, స్వప్నా సినిమా, వెఫరెర్ ఫిలిమ్స్ బ్యానర్లపై దుల్కర్ సల్మాన్-రానా- స్వప్నా దత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహానటి, విరాటపర్వం సినిమాలకు పనిచేసిన డానీ సాంచెజ్ లోపేజ్ సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలపై రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది. ఈ మూవీ లాంచింగ్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
A collaboration of two creative powerhouses for an epic tale💥 @SpiritMediaIN and @DQsWayfarerFilm join forces for an exciting multilingual film #Kaantha ❤️🔥
A story that resonates with contemporary emotions set in 1950s Madras💥
Starring @dulQuer #BhagyashriBorse
Directed by… pic.twitter.com/YKUf6Psya2— BA Raju’s Team (@baraju_SuperHit) September 9, 2024
Jr NTR | ఒకే ఫ్రేమ్‌లో సందీప్ రెడ్డి వంగా, జూనియర్ ఎన్టీఆర్ .. స్పెషలేంటో మరి..!
Maa Nanna Superhero | క్యూరియాసిటీ పెంచుతోన్న సుధీర్ బాబు.. మా నాన్న సూపర్ హీరో ఫస్ట్ లుక్ వైరల్