Rajinikanth | సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా వైద్యులు తలైవాకి చిన్నపాటి సర్జరీ చేశారు. అనుభవగ్నులైన ముగ్గురు వైద్యులు రజనీకాంత్‌కు పొత్తికడుపు కింది భాగంలో స్టెంట్ వేశారు (Stent Placed In Lower Abdominal Area). ఈ ప్రక్రియ విజయవంతమైనట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. రెండు లేదా మూడు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు.
రజనీకాంత్ సోమవారం అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని అపోలో దవాఖానకు తరలించారు. కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి సతీశ్ ఆధ్వర్యంలోని ప్రత్యేక వైద్యుల బృందం సూపర్‌స్టార్‌కు చికిత్స అందిస్తున్నారు. ఇక తలైవా దవాఖానలో చేరిన విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం రజనీకి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.
Also Read..
Rajinikanth | నా స్నేహితుడు త్వరగా కోలుకోవాలి.. రజనీకాంత్ ఆరోగ్యంపై సీఎం స్టాలిన్
Rajinikanth | సూపర్ స్టార్ రజనీకాంత్‌కు అస్వస్థత.. వైద్యుల పర్యవేక్షణలో సూపర్ స్టార్
Govinda | బాలీవుడ్ నటుడు గోవిందా ఇంట్లో గన్ మిస్‌ఫైర్.. కాలులోకి దూసుకెళ్లిన బుల్లెట్