తమిళ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో ఎవరు..? కొన్ని రోజులుగా దీని గురించి చర్చ బాగా జరుగుతుంది. ఎందుకంటే రజనీకాంత్ కు కొన్ని సంవత్సరాలుగా సరైన విజయం లేదు. ఆయన నటించిన సినిమా లేవి బాక్సాఫీస్ దగ్గర పెద్దగా కలెక్షన్స్ వసూలు చేయడం లేదు. ఇదే సమయంలో విజయ్ సినిమాలు 200- 350 కోట్ల మధ్యలో వరుసగా వసూలు చేస్తున్నాయి. దాంతో ఈయన మార్కెట్ భారీగా పెరిగిపోయింది. అందుకే విజయ్ (Vijay) నెంబర్ వన్ అంటూ అభిమానులు అనధికారికంగా ప్రకటించేశారు.
అంతెందుకు మొన్నటికి మొన్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా తమిళ ఇండస్ట్రీలో విజయ్ నెంబర్ వన్ హీరో అంటూ నోరు జారి అనవసరంగా వివాదంలో ఇరుక్కున్నాడు. మరోవైపు అజిత్ (Ajith Kumar) అభిమానులు కూడా తక్కువ ఏమి తినడం లేదు. ప్రమోషన్ చేసుకున్నా.. లేకపోయినా తమ హీరో సినిమాకు వచ్చే కలెక్షన్స్ ఎలా ఉంటాయో ప్రపంచానికి తెలుసు.. కాబట్టి అజిత్ నెం 1 అంటూ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే తాను ఇంకా రిటైర్మెంట్ తీసుకోలేదు.. అప్పుడే నెంబర్ వన్ గురించి చర్చ ఏమిటి అంటూ రజనీకాంత్ (Rajinikanth) రేసులోకి వచ్చేస్తున్నారు.
ప్రస్తుతం ఈయన జైలర్ సినిమాలో నటిస్తున్నాడు. దీంతోపాటు మరో ముగ్గురు దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో ఒక తెలుగు దర్శకుడు ఉండటం గమనార్హం. నెల్సన్ దర్శకత్వంలో జైలర్ సినిమా చేస్తున్న రజనీకాంత్.. దీని తర్వాత కూడా వరుస సినిమాలు చేయాలని ఫిక్స్ అయిపోయారు. ఈ క్రమంలోనే లైకా ప్రొడక్షన్స్ తో రెండు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకున్నారు రజిని. దీనికి దర్శకులుగా లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్.. బింబిసార దర్శకుడు వశిష్ట ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఇద్దరు దర్శకులు చెప్పిన కథలు రజనీకాంత్ కు నచ్చాయి.
Read Also : Vinaro Bhagyamu Vishnu Katha | కూల్‌గా కిరణ్ అబ్బవరం వాసవ సుహాస సాంగ్ ప్రోమో
Read Also : Naatu Naatu Song | నాటు నాటు క్రేజ్‌కు ఆస్కార్ రావాల్సిందే.. వీడియో సాంగ్‌పై లుక్కేయండి
Read Also : Vijay Sethupathi | విజయ్ సేతుపతి అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. గెట్ రెడీ