రజనీకాంత్ ప్రధాన పాత్రలో శివ తెరకెక్కిస్తున్న చిత్రం అన్నాత్తె. 2019లో మొదలైన ఈ చిత్ర షూటింగ్ కరోనా వలన నత్తనడకన సాగుతుంది. గత ఏడాది డిసెంబర్లో షూటింగ్ ప్రారంభించినప్పుడు సెట్లో కొందరికి కరోనా రావడంతో పాటు రజనీకాంత్ కూడా అస్వస్థతకు గురయ్యారు. దీంతో షూటింగ్‌ను కొన్ని నెలల పాటు వాయిదా వేశారు. ఇక నెల రోజుల క్రితం కరోనా నిబంధనలను పాటిస్తూ షూటింగ్ తిరిగి మొదలు పెట్టారు. తాజాగా రజనీ పార్ట్ పూర్తి కావడంతో ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేట విమానశ్రయం నుండి చెన్నైకి వెళ్లారు.
రజనీకాంత్ సతీమణి లత ఆయనకు హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించారు. ప్రస్తుతం రజనీకాంత్ ఎయిర్ పోర్ట్ ఫొటోలు, చెన్నై ఇంటికి వెళ్లిన సమయంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈ వారంలో అన్నాత్తె డబ్బింగ్ పూర్తి చేసి ఆ తర్వాత రజనీకాంత్ మెడికల్ చెకప్ కోసం అమెరాకా వెళ్లనున్నట్టు పలు వార్తలు వస్తున్నాయి. కాగా,ధనుష్ ఓ హాలీవుడ్ చిత్రీకరణ కోసం ఇటీవల అమెరికా వెళ్లగా ఆయనతో పాటు ఐశ్వర్య , పిల్లలను కూడా తీసుకెళ్లారట.
Superstar #Rajinikanth returned back to Chennai after completing shoot for #Annaatthe at Hyderabad. pic.twitter.com/grPNxEWDSm
— BA Raju's Team (@baraju_SuperHit) May 12, 2021