సినీ పరిశ్రమలో దాదాపు నాలుగు దశాబ్ధాలకు పైగా సేవలు అందించిన రజనీకాంత్ సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు అందుకున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah Naidu) ఆయనకు అవార్డును అందజేశారు. సినీ రంగంలో నటనతో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న రజనీకాంత్‌కి ఈ విశిష్ట గౌరవం దక్కడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఒకే ఏడాదిలో రజనీకాంత్(Rajinikanth), ఆయన అల్లుడు ధనుష్(Dhanush) అవార్డులు అందుకోవడం పట్ల సూపర్‌స్టార్ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఇదే అవార్డుల ప్రధానోత్సవంలో హీరో ధనుష్ అసురన్ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. కాగా, రజనీకాంత్ కేవలం హీరోగానే కాకుండా.. దర్శకుడిగా.. నిర్మాతగా సినీ పరిశ్రమలో నిజంగానే సూపర్ స్టార్ అనిపించుకున్నారు రజనీకాంత్. ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తూ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు తలైవా.
అవార్డుల ప్రధానోత్సవానికి వెళ్లేముందు రజనీకాంత్ స్థానిక ఫోయెస్‌గార్డెన్‌లోని తన నివాసంలో మీడియాతో ముచ్చటించారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు తనకు లభించడం సంతోషంగా ఉందని రజనీకాంత్ పేర్కొన్నారు. ఇలాంటి శుభతరుణంలో తన గురువు కె.బాలచందర్ లేకపోవడం ఎంతో బాధగా ఉందన్నారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం నాకెంతో ఆనందంగా ఉంది. ఇంత గొప్ప అవార్డు రావడం సినీ ప్రేక్షకులు, తమిళ ప్రజల ఆదరాభిమానాల వల్లే సాధ్యమైంది అని అన్నారు.
Proud moment for all!
— Kaushik LM (@LMKMovieManiac) October 25, 2021
👑 #DadasahebSuperstarRAJINI 🔥
pic.twitter.com/Fw9mU3SQqv
ఇవి కూడా చదవండి
Charmy Kaur | యాక్టింగ్‌లోకి రీఎంట్రీపై ఛార్మీ ఏమన్నదంటే..?
Rajinikanth | రేపు నాకు చాలా ప్రత్యేకమైన రోజు: ట్విటర్ లో రజినీకాంత్
Rakul Preet Singh | రకుల్‌ప్రీత్ సింగ్ కొత్త యోగాసనం
Bigg Boss: హౌజ్‌మేట్స్‌తో పలు గేమ్స్ ఆడించిన నాగార్జున.. విజేతగా నిలిచిన అనీ మాస్టర్
Raja Babu: రాజబాబు కన్నుమూత.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు