సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్య పరీక్షల కోసం అమెరికాకు వెళ్లబోతున్నారంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లే వీలు లేదు. అయిన కూడా తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రజినీ సెంట్రల్ గవర్నమెంట్‌కు అనుమతి కోరుతూ లెటర్ రాశారు. అక్కడినుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో అబ్రోడ్ పయనమయ్యారు.
ఈ రోజు ఉదయం రజనీకాంత్ ప్రత్యేక ఫ్లైట్‌లో యూఎస్‌కి పయనం అయ్యారు. ఎయిర్ పోర్ట్‌కి తన భార్యతో కారులో వచ్చిన సమయంలో తీసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. 14 సీట్ల కెపాసిటీ కలిగిన స్పెషల్ ఫ్లైట్‌లో కుటుంబసభ్యులతో కలిసి రజనీకాంత్ అమెరికాకి వెళ్లినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆయన అల్లుడు ధనుష్, కూతురు అమెరికాలో ఉన్న విషయం తెలిసిందే.
Superstar @rajinikanth left to US earlier today pic.twitter.com/FT9Wm4zfiJ
— BA Raju's Team (@baraju_SuperHit) June 19, 2021