‘కూలీ’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న సూపర్‌స్టార్ రజనీకాంత్ తన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. బుధవారం ఈ సినిమా తాలూకు అధికారిక ప్రకటన వెలువడింది. ‘తలైవర్173’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహిస్తారు.
‘అరుణాచలం’ (1997) తర్వాత రజనీకాంత్-సుందర్ సి కాంబినేషన్లో రాబోతున్న చిత్రమిదే కావడం విశేషం. రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్‌హాసన్, ఆర్.మహేంద్రన్ నిర్మించనున్నారు. లెజెండరీ నటులైన రజనీకాంత్-కమల్‌హాసన్ మధ్య ఉన్న దశాబ్దాల స్నేహాన్ని, సహోదర బంధాన్ని సెలబ్రేట్ చేసుకునేలా ఈ సినిమా ఉండబోతున్నదని, 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ తెలిపారు.