చెన్నై: అనారోగ్యంతో దవాఖానలో చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) డిశ్చార్జ్ అయ్యారు. తీవ్ర కడుపు నొప్పితో చెన్నైలోని ఓ ప్రైవేటు దవాఖానలో సెప్టెంబర్ 30న జాయిన్ అయిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం హృదయ నాళంలో సమస్యను గుర్తించిన వైద్యులు సెప్టెంబర్ 1న ఆయనకు స్టెంట్ వేశారు. రెండు రోజులపాటు వైద్యుల అబ్జర్వేషన్లో ఉన్న రజనీ.. పూర్తిగా కోలుకోవడంతో గురువారం రాత్రి డిశ్చార్జి అయి.. ఇంటికి చేరుకున్నారు.
కాగా, రజనీకాంత్ గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడింది. దీనికి ట్రాన్స్‌కాథెటర్ పద్ధతి ద్వారా డాక్టర్లు చికిత్స అందించి స్టెంట్ అమర్చిన విషయం తెలిసిందే. రజనీ దవాఖానలో చేరినట్లు తెలియగానే అభిమానులతోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. రజనీ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నారు. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఆయన యాక్ట్ చేసిన వేట్టయాన్ ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌కు మంచి టాక్ సొంతం చేసుకున్నది.