Rajinikanth | సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి జైలర్ సీక్వెల్ జైలర్ 2 (Jailer 2). తలైవా టైటిల్ రోల్లో నటిస్తోన్న ఈ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilipkumar)డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు తలైవా.
మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో ఆసక్తికర విషయాన్ని షేర్ చేశాడు రజినీకాంత్. జైలర్ 2 షూటింగ్ తుది దశలో ఉందని.. త్వరలో చిత్రీకరణ పూర్తవుతుందని తెలిపాడు. అంతేకాదు విడుదల తేదీని మేకర్స్ త్వరలోనే ప్రకటిస్తుందని కూడా చెప్పాడు. జైలర్ 2ను 2026 జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని ఇప్పటికే రజినీకాంత్ క్లారిటీ కూడా ఇచ్చాడని తెలిసిందే. తాజాగా టాక్ ప్రకారం ఇండిపెండెన్స్ డే వీకెండ్ టైంలో జైలర్ 2 విడుదలకు ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తుండగా.. మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
సీక్వెల్లో బాలీవుడ్ భామ విద్యాబాలన్‌తోపాటు కోలీవుడ్ యాక్టర్ సంతానం కీలక పాత్రల్లో నటిస్తున్నారని తెలుస్తుండగా.. మరి రాబోయే రోజుల్లో ఈ స్టార్ యాక్టర్లపై అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది. జైలర్ ఫస్ట్ పార్టులో రమ్యకృష్ణ, వినాయకన్, వసంత్ రవి, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, తమన్నా కీలక పాత్రల్లో నటించారని తెలిసిందే. సీక్వెల్లో ఎవరెవరుండబోతున్నారన్నదానిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. సీక్వెల్లో శివరాజ్‌కుమార్, మోహన్ లాల్ పాత్రలు రిపీట్ కానున్నాయని ఇప్పటికే వార్తలు వచ్చాయి. మరోవైపు తాజాగా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడని అప్డేట్ కూడా వచ్చింది.
Shah Rukh Khan | కింగ్ ఖాన్ హాలీవుడ్ ఎంట్రీ?.. ‘ది వైట్ లోటస్’ వెబ్ సిరీస్‌లో షారూఖ్.!
Watch: పొలంలో కూలిన యూఏవీ.. తర్వాత ఏం జరిగిందంటే?
Sara Arjun | 1300 మందిని ఆడిషన్స్ చేశారట.. ధురంధర్లో సారా అర్జున్ ఎలా ఫైనల్ అయిందంటే..?