Rajendra Prasad | నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఒకప్పుడు హీరోగా వైవిధ్యమైన సినిమాలు చేసి ప్రేక్షకులని ఎంతగానో అలరించారు. ఆయన సినిమాలు ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టేవి కావు. ఇక ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్‌లోను నటిస్తూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నారు. అయితే ఈ మధ్య రాజేంద్ర ప్రసాద్ సభా సంస్కారం లేకుండా మాట్లాడుతూ విమర్శల పాలవుతున్నాడు. ఆ మధ్య జరిగిన రాబిన్‌హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్లో వార్నర్‌ని రాజేంద్రప్రసాద్ సరదాగా కామెంట్స్ చేసిన అభ్యంతరకరమైన పదాన్ని వాడడంతో దానిపై చాలా మంది సీరియస్ అయ్యారు. ఆయన సరదాగా మాట్లాడినప్పటికీ ఆ విధానం కరెక్ట్‌గా లేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. తన వ్యాఖ్యలు ట్రోల్‌కు గురవడంతో రాజేంద్రప్రసాద్ క్షమాపణలు తెలిపారు.
తాజాగా మరోసారి తన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలలో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్ మైక్ అందుకుంటూనే దురుసుగా మాట్లాడాడు. అంతే కాకుండా నటుడు ఆలీని అందరి ముందే తిట్టేశారు. ఆలీని ఉద్దేశించి వాడిన పదజాలం తీవ్ర దుమారం రేపుతుంది. దీనిపై నెటిజన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ తన స్పీచ్‌లో భాగంగా.. మీరందరూ వస్తున్నారని నాకు చెప్పలేదు, రాకుంటే నేను మిస్ అయ్యే వాడిని. ఏరా అచ్చన్న (నిర్మాత అచ్చిరెడ్డిని)… బయటికి రా నీ సంగతి చూస్తా” అంటూ ఫైరింగ్ మీద కనిపించాడు. ఇక ఆలీగాడు ఎక్కడ ఉన్నాడు అంటూ ఓ బూతు పదం వాడి.. ఇదంతా మనకు కామనే అని అన్నాడు.
ఆ తర్వాత సభలోని ప్రేక్షకులపై కూడా అసహనం వ్యక్తం చేశారు. తాను అంతకుముందు రోజు ఎన్టీఆర్ అవార్డు అందుకున్న విషయాన్ని ప్రస్తావించగా, ఎవరూ చప్పట్లు కొట్టలేదు.. దాంతో “ఏంటి మీరు చప్పట్లు కొట్టరా?” అని అడిగి మరీ చప్పట్లు కొట్టించుకున్నారు. “మీ అందరికీ బ్రెయిన్ పోయిందా?” అని, చప్పట్లు కొట్టకపోతే “సిగ్గు లేనట్టే” అంటూ అసభ్యకరంగా మాట్లాడాడు. సీనియర్ నటుడు అయి ఉండి కనీసం సభా మర్యాద కూడా తెలియకపోతే ఎలా అంటూ తిట్టిపోస్తున్నారు. మరి దీనిపై రాజేంద్ర ప్రసాద్ ఏదైన వివరణ ఇస్తాడా చూడాలి.