ఇటీవల రాజేంద్ర ప్రసాద్ కాంట్రవర్సీస్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తున్నాడు. పలు ప్రెస్ మీట్లు, సినిమా ఈవెంట్లలో ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. తాజాగా జరిగిన ఎస్వీకృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలో పాల్గోన్న ఆయన మాజీ మంత్రి రోజాపై కూడా సంచలన కామెంట్స్ చేశారు. ఏమే నిన్ను కూడా నేనే హీరోయిన్ను చేశాను కదా అని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. అలానే ఆలీని తీవ్ర పదజాలంతో మాట్లాడారు. దీనిపై నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకుంత నోటి దురుసు అంటూ మండిపడుతున్నారు. ఈ క్రమంలో రాజేంద్ర ప్రసాద్ స్పందించారు.
నేను అందరితో సరదాగా ఉంటాను వాళ్ళు కూడా నాతో సరదాగా ఉంటారు. ఈ మధ్య కొన్ని ఈవెంట్లలో వాళ్ళు.. నావాళ్ళు అనే ఉద్దేశంతో పొరపాటున అనేసిన కొన్ని మాటలను కొందరు తప్పు అని అంటున్నారు. నేను ఇలాగే ఉంటాను.. నేనేంటో అందరికీ తెలుసు. సరదాగా ఫ్లోలో అనేసిన మాటలను తప్పుగా అర్థం తీసుకోవడం అది మీ సంస్కారం అని చెప్పుకొచ్చారు. ఈ మధ్య కొన్ని ఫంక్షన్లలో నేను ఏదైనా మాట్లాడుతుంటే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అది మీ కర్మ. మీ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. నేనేం చేయలేను. తప్పుగా అర్థం చేసుకుంటే అది మీ సంస్కారం. నేను అయితే ఇలాగే ఉంటాను. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతుంటా అని చెప్పుకొచ్చారు.
నాతో అందరు నటీనటులు సరదాగా ఉంటారు. వారికి అన్ని విషయాలు చెబుతాను. కొత్త ఆర్టిస్టులకి నాకు ఏమి తేడా ఉండదు. నాకు కాస్త ఎక్స్పీరియన్స్ ఎక్కువ అంతే. ఈ మధ్య నేను పరిచయం చేసిన హీరోయిన్, యాక్టర్ గురించి మాట్లాడితే వాటి గురించి కూడా తప్పుగా అనుకున్నారు. నేను ఇలానే ఉంటాను. ఎందుకంటే అన్నయ్యని కాబట్టి అని చెప్పుకొచ్చారు రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ ఉపయోగించిన భాష పట్ల అభ్యంతరం వ్యక్తం అయ్యింది. ఆయన వయసుకు ఆ విధంగా మాట్లాడటం సరికాదని సామాన్యులు సైతం అంటున్నారు.