Rajendra Prasad | ఒకప్పటి నటి రమాప్రభ ఎన్నో సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రమా ప్రభ వందలాది సినిమాల్లో నటించి మెప్పించింది. మాతృభాష తెలుగు అయినప్పటికీ వెంటనే సినిమా అవకాశాలు రాకపోవడంతో తమిళ థియేటర్లో నాలుగు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చింది. ఇక తమిళంలో 30 సినిమాలు చేసిన తర్వాతే తెలుగులో నటిగా పరిచయమైంది.తెలుగులో రమాప్రభ నటించిన తొలి చిత్రం ‘చిలకా గోరింక’. వందలాది సినిమాల్లో నటించిన రమాప్రభకు చదవడం, రాయడం రాదు.డైలాగులు ఒక్కసారి చదివి గుర్తుపెట్టుకుని సింగిల్ టేక్ లో షాట్ పూర్తి చేస్తుంది.
ఇక శరత్ బాబుని వివాహం చేసుకున్న రమాప్రభ పలు కారణాల వలన ఆయన నుండి విడిపోయి సింగిల్‌గా ఉంది. తన ఆస్తి శరత్ బాబు కాజేశారంటూ చాలా సందర్భాల్లో చెప్పుకోచ్చారు రమా ప్రభ. ఇక ఇండస్ట్రీకి కూడా దూరంగా మదనపల్లెలోని వాయల్పాడులో తన తమ్ముడి కుటుంబంతో పాటు ఉంటున్న రమాప్రభ ఏదైన పని ఉంటేనే హైదరాబాద్‌కి వస్తుంది. అయితే రమా ప్రభ తన చెల్లెలి కూతురిని దత్తత తీసుకొని పెంచి పెద్దది చేసింది. ఇక ఇండస్ట్రీలో తనకు బాగా నచ్చిన మంచి అల్లుడు కావాలి అనుకున్న రమా ప్రభ.. రాజేంద్ర ప్రసాద్ కు తన కూతురిని ఇచ్చి పెళ్ళి చేశారు.
అలా రమా ప్రభకు రాజేంద్ర ప్రసాద్ అల్లుడు కావడంతో ఇద్దరి మధ్య దగ్గరి బంధుత్వం ఉంది. అప్పుడప్పుడు రమా ప్రభ హైదరాబాద్ లోని రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వస్తుంటుంది .ఈ మధ్యనే రాజేంద్ర ప్రసాద్ కూతురు గుండెపోటుతో మరణించగా, ఆ విషాదం నుండి బయటపడేందుకు అప్పుడప్పుడు తన ఫ్యామిలీతో మదనపల్లె వెళ్ళి.. అత్తగారింటో హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తుంటారు రాజేంద్ర ప్రసాద్. కాగా, రాజేంద్రప్రసాద్ నటించిన ‘గాంధీనగర్ రెండో వీధి’, ‘అప్పుల అప్పారావు’ చిత్రాలను రమాప్రభ నిర్మించారు.ఇక రమాప్రభ ఇప్పుడు ‘రమా ప్రభ ప్రయాణం’ పేరుతో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను తన యూట్యూబ్ ఛానెల్ లో వీడియోలను అప్ లోడ్ చేస్తూ తన అభిమానులని అలరిస్తూ ఉంటుంది.