కుటుంబ కథల్ని ఆదరించడానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారని, అందుకు ‘సఃకుటుంబానాం’ చిత్ర విజయమే నిదర్శమని అన్నారు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్. ఆయన ఓ కీలక పాత్రలో రామ్‌కిరణ్, మేఘ ఆకాష్ జంటగా ఉదయ్‌శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. శనివారం సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజేంద్రప్రసాద్ పైవిధంగా స్పందించారు.
కొత్త ఏడాది తెలుగులో తొలిహిట్ ఇదని దర్శకుడు ఆనందం వ్యక్తం చేశారు. సినిమాకు థియేటర్లు పెరుగుతున్నాయని, అంతటా మంచి స్పందన లభిస్తున్నదని నిర్మాత మహదేవ్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.