హీరోగా గర్వించదగ్గ ప్రస్థానం డా.రాజశేఖర్‌ది. జనహృదయాల్లో చిరస్థాయిగా నిలిచుండే సినిమాల్లో నటించారాయన. నటుడిగా ఈ అల్లరిప్రియుడు ఎప్పటికీ జనప్రియుడే. ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. రీసెంట్గా నితిన్ హీరోగా చేసిన ‘ఎక్స్ట్రార్డినరీ మ్యాన్’లో ఓ కీలక పాత్ర పోషించిన రాజశేఖర్, త్వరలో శర్వానంద్ హీరోగా రూపొందుతోన్న చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషించనున్నారు.
యూవీ క్రియేషన్స్ పతాకంపై అభిలాష్‌రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్నది. రాజశేఖర్ ఇటీవలే ఈ సినిమా సెట్లోకి ఎంట్రీ ఇచ్చినట్టు సమాచారం. ఈ సినిమాలో ఆయనది ఫుల్లెన్త్ కేరక్టర్ అని తెలుస్తున్నది. అయితే.. అది నెగెటీవ్ పాత్ర మాత్రం కాదట. శర్వానంద్ 36వ చిత్రంగా రానున్న ఈ సినిమాలో మాళవిక నాయర్ కథానాయిక.