గులాబీ జెండా ఎగిరెనోయ్
గులాబీ జెండాఎగిరెనోయ్ కోట్లాది గుండెలు మురిసెనోయ్ తెలంగాణ తల్లి మోమున నూతన కాంతులు విరిసెనోయ్
గులాబీ జెండాఎగిరెనోయ్
కోట్లాది గుండెలు మురిసెనోయ్
తెలంగాణ తల్లి మోమున నూతన
కాంతులు విరిసెనోయ్ ||గులాబీ||
చరణం 1:
అణువు అణువున పౌరుషత్వం
కణము కణమున సాహసత్వం
మాటలోన అమృతత్వం
మనసులోన సాధుతత్వం
వాసిగల్గిన తెలంగాణ వారసత్వం సోదరా
వీరచరితల తలుచుకొని అ(స)మరగానము సేయరా
చరణం 2:
జీవనదుల జీవిక.. భూగర్భ గనుల పేటిక
హరితవనముల వాటిక.. శ్రమైక జీవన వేదిక
సకల వనరుల తెలంగాణ సర్వమూ కోల్పోయెరా
వలసవాదం చెరల చిక్కి వలవలా విలపించెరా
రాగవీణ తెలంగాణ రక్తధారల తడిసెరా ||గులాబీ||
చరణం 3:
నీళ్లు, నిధులు జారగొట్ట్టి.. కొలువులన్నీ కొల్లగొట్టి
కష్టజీవుల కడుపుగొట్టి.. యువత కలలను పాతిపెట్టి
ద్రోహమే అధికారమయ్యిదోపిడీని సాగించెరా
గుండె రగిలిన తెలంగాణ తిరుగుబాటై ఎగిసెరా
వేలాది అమరుల ప్రాణత్యాగం స్థూపమై వెలసిందిరా ||స్వరాష్ట్ర ||
మున్నూట అరవై ప్రాణాల త్యాగం స్థూపమై వెలిసిందిరా
చరణం 4:
పెరిగి విరిగిన పోరు కెరటం
పునర్జీవము పొందెరా
మేలుకొని మేధావిలోకం
విత్తనాలెగజల్లెరా
రాజకీయ పటిమ చాటుతూ ఉద్యమం ఉరికిందిరా
శాంతి పథమున క్రాంతిరథమై లక్ష్యమును చేరిందిరా
తరతరాల తపన తీరగ గమ్యమును ముద్దాడెరా
చరణం 5
వంచనే తలవంచుకున్నది
కుట్ర మొగమును దించుకున్నది
కటిక చీకటి తప్పుకున్నది
కాంతిపురులను విప్పుకున్నది
భారతావని ముద్దుబిడ్డయి-పుట్టినది నవరాష్ట్రమూ
స్వేచ్ఛ కోసం పోరిన తెలంగాణ వీరచరితమూ
భూమిపుత్రుల ధీరచరితలో సువర్ణాక్షర లిఖితమూ.
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | రైళ్ల నుంచి దింపివేత, ఇండ్లకెళ్లి అరెస్టులు.. పోలీసుల నిర్బంధంలో వేలాది మంది యువజనులు
Gyanesh Kumar | జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. ఒక్కరిని కాపాడేందుకు ఎందుకీ తాపత్రయం?: కేటీఆర్
CJP Protest | జంతర్ మంతర్ 2.0తో హైఅలర్ట్.. సెంట్రల్ ఢిల్లీ లాక్డౌన్.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత, ఇంటర్నెట్ సేవలు బంద్!
RTC Elections | ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్!
Voter Deletion | టార్గెట్ బీఆర్ఎస్?.. తొలగించిన ప్రతి రెండు ఓట్లలో ఒకటి బీఆర్ఎస్ నియోజకవర్గానిదే
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

