ప్రతినెలా రూ.6 వేల కోట్లకుపైగా రేవంత్ సర్కార్ అప్పు
రాష్ర్టాన్ని అప్పుల ఊబిలో దింపడ మే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్ తాజాగా రిజ ర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి మరో రూ.4,000 కోట్ల అప్పు తీసుకున్నది.
- ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.16,900 కోట్లు తెచ్చిన కాంగ్రెస్ సర్కార్
హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాన్ని అప్పుల ఊబిలో దింపడ మే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్ తాజాగా రిజ ర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి మరో రూ.4,000 కోట్ల అప్పు తీసుకున్నది. సె క్యూరిటీ బాండ్ల వేలం ద్వారా మంగళవా రం ఈ రుణాన్ని సమీకరించింది. ఇందులో 17 ఏండ్ల కాలపరిమితితో 7.90 వార్షిక వ డ్డీకి రూ.2,000 కోట్లు, 30 ఏండ్ల కాలపరిమితితో 7.88 వార్షిక వడ్డీకి మరో రూ.2,000 కోట్లు తీసుకున్నట్టు ఆర్బీఐ వె ల్లడించింది. దీంతో 2026-27లో ఇప్పటివరకు తీసుకున్న అప్పు రూ.16,900 కో ట్లు. ఈ ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో రూ.18,900 కోట్లు అ ప్పు తీసుకుంటామని ఆర్బీఐకి ప్రతిపాదన లు సమర్పించిన సర్కార్.. ఏప్రిల్‌లో రూ.6,900 కోట్లు, మే నెలలో రూ.6 వేల కోట్లు, ఇప్పుడు రూ.4 వేల కోట్లు అప్పు తీ సుకున్నది. మిగిలిన రూ.2, 000 కోట్ల రు ణాన్ని కూడా ఈ నెలలోనే సమీకరించబోతున్నది. ఈ లెక్కన కాంగ్రెస్ ప్రభుత్వం ప్ర తినెలా బహిరంగ మారెట్ నుంచి సగటు న రూ.6,000 కోట్లకుపైగా అప్పులు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నట్టు స్పష్టమవుతున్నది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.54,009 కోట్ల రుణాలు సమీకరిస్తామని రాష్ట్ర బడ్జెట్లో ప్రతిపాదించిన ప్రభుత్వం ఆర్బీఐ నుంచి ఓపెన్ మారెట్ రుణాల రూపంలో రూ.85,840 కోట్లు తీసుకున్నది.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ నుంచి తెచ్చిన అప్పులు
తేదీ రుణం (రూ.కోట్లలో)
- ఏప్రిల్ – 7 3,900
- ఏప్రిల్- 21 3,000
- మే – 5 4,000
- మే – 19 2,000
- జూన్ – 2 4,000
- మొత్తం -16,900
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

