ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన మహేష్‌బాబు-రాజమౌళి సినిమా తాలూకు ‘గ్లోబ్‌ట్రాటర్’ ఈవెంట్‌కు దేశవ్యాప్తంగా భారీ అటెన్షన్ క్రియేట్ అయిన విషయం తెలిసిందే. సినిమాలో రామాయణ ఘట్టం కీలకంగా ఉంటుందని, ఆ ఎపిసోడ్లో మహేష్‌బాబు..రాముడిగా కనిపిస్తారనే వార్త బాగా వైరల్ అయింది. మొత్తానికి తొలి ఈవెంట్‌తోనే ‘వారణాసి’ చిత్రానికి కావాల్సినంత హైప్ తీసుకొచ్చారు రాజమౌళి.
ఇదిలావుండగా ఈ సినిమా బడ్జెట్‌పై బాలీవుడ్ మీడియాలో ఆసక్తికరమైన కథనాలు వెలువడుతున్నాయి. దుర్గ ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దాదాపు వెయ్యికోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారనే వార్త ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. అయితే బాలీవుడ్ మీడియాలో ప్రస్తుతం వినిపిస్తున్న కథనాల ప్రకారం 1300కోట్ల బడ్జెట్‌తో రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారట.
ఇప్పటివరకూ ఇండియన్ స్క్రీన్‌పై రానటువంటి విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని చూపించాలనే నిశ్చయంతో రాజమౌళి ఉన్నారని.. దర్శకుడిగా ఆయన విజన్‌పై నమ్మకం ఉంచిన మేకర్స్ అంత భారీ మొత్తాన్ని కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నారని కథనాలు వెలువడుతున్నాయి. రణబీర్‌కపూర్ ‘రామాయణ’ ఫ్రాంచైజీని దాదాపు 2000కోట్లతో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే అది రెండు భాగాలు.
‘రామాయణ’ చిత్రానికి వస్తున్న హైప్ దృష్ట్యా..‘వారణాసి’ని అంతకుమించిన ఉన్నత ప్రమాణాలతో తీసుకురావాలనే లక్ష్యంతో రాజమౌళి ఉన్నారని బాలీవుడ్ టాక్. ‘వారణాసి’లోకి కొన్ని ఎపిక్ సీక్వెన్స్‌ల విషయంలో అన్కాంప్రమైజ్డ్గా వెళ్లాలని రాజమౌళి నిర్ణయించుకున్నారట. దాంతో 1300కోట్ల బడ్జెట్ అవశ్యమని అంటున్నారు. ఈ బాలీవుడ్ మీడియా కథనాల్లో నిజమెంతుందో తెలియదు కానీ..ఈ వార్త మాత్రం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నది.