e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home News Akhanda: అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ హంగామా మాములుగా లేదు..!

Akhanda: అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ హంగామా మాములుగా లేదు..!

సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం అఖండ‌. ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూడో చిత్రం కావ‌డంతో అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటిస్తుండగా, తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 2న రిలీజ్ కాబోతుంది. దీనికి అధికారిక ప్రకటన విడుదలైంది. విడుదల తేది దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది చిత్రబృందం

నవంబర్ 27 న శిల్పకళావేదికలో ‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వస్తున్నాడని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలయ్య- బన్నీ ఒకే స్టేజీపై కనిపించనున్నారన్న ఆనందంలో అభిమానులు త‌డిసి ముద్ద‌వుతున్న క్ర‌మంలో మ‌రో అప్‌డేట్ ఇచ్చారు. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి కూడా ఈ వేడుక‌లో పాల్గొన‌నున్న‌ట్టు తెలియ‌జేశారు. దీంతో రాజ‌మౌళి, బాల‌య్య‌, బ‌న్నీ స్పీచ్‌లు ఎలా ఉంటాయా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

- Advertisement -

ఈ సినిమా తాజాగా సెన్సార్‌ను కూడా పూర్తి చేసుకుంది. అఖండకు U/A సర్టిఫికేట్ వచ్చినట్లు చిత్రబృందం ప్రకటించింది. అంతేకాదు రన్ టైమ్ కూడా తెలిసింది. ఈ సినిమా రెండు గంటల 47 నిమిషాల నిడివితో విడుదలకానుందని అంటున్నారు. ఇక దీపావళి సందర్భంగా ఈ చిత్రం నుంచి విడుదలైన భం అఖండ‌, భంభం అఖండ ప్రేక్షకులను ఆకట్టుకుంది. థియేటర్‌లో పాట ఫ్యాన్స్‌కు పూనకాలనే తెస్తుందని అంటున్నారు నెటిజన్స్. థమన్ మ్యూజిక్‌తో పాటు లిరిక్స్ కూడా అదిరిపోయాయి.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement