Rajamouli – Mahesh Project | ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli), సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. SSMB29 అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌ను దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మహేశ్ – రాజమౌళి కాంబోలో ఫస్ట్ మూవీ కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రంలో ప్రియంకా చోప్రా కథానాయికగా నటిస్తుండగా.. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం.
ఈ సినిమా షూటింగ్ ఒడిషాలో శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. గత 15 రోజులుగా ఈ సినిమా చిత్రీకరణ ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో నడుస్తోంది. సిమిలిగుడకు సమీపంలోని మాలి, పుట్‌సీల్, బాల్డ తదితర ప్రాంతాల్లో నటీనటులతో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. మంగళవారం రాత్రికి ఒడిశా షెడ్యూల్ పూర్తయినట్లు సమాచారం. ఈ సందర్భంగా నటీనటులను చూసేందుకు అక్కడి అభిమానులు ఉత్సాహం కనబరిచారు. వారు సెట్‌కు వచ్చి నటీనటులు మరియు చిత్ర బృందంతో కలిసి ఫోటోలు తీసుకున్నారు. ఇక రాజమౌళితో పాటు మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా అక్కడి ప్రజలతో దిగిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఈ ప్రాజెక్ట్ తదుపరి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగనున్నట్లు సమాచారం.
And that’s a wrap for ~ Action Sequence Done ✅ #SSMB29 🎬✨@urstrulyMahesh 🦁🔥
Truly a privilege to witness the magic unfold. Grateful for the journey and beyond excited for what’s next @ssrajamouli !
~ 💃🕺🧨 The shoot is going on a full swing✨@priyankachopra @ssk1122 pic.twitter.com/MrzRT47QRL— Odisha MAHESH FC™🌍 (@OdishaMaheshFC) March 18, 2025