Rajahmundry Rosemilk Teaser Date Announced | టాలీవుడ్లో ప్రస్తుతం చిన్న సినిమా,పెద్ద సినిమా అని తేడాలు ఏమి లేవు. కంటెంట్‌తో వచ్చే ప్రతి సినిమా పెద్ద సినిమా స్థాయిలోనే విజయాలు సాధిస్తున్నాయి. స్టార్స్‌తో సంబంధం లేకుండా కంటెంట్ మీదున్న నమ్మకంతో యంగ్ టాలెంట్ సినిమాలు తీసి హిట్లు కొడుతున్నారు. ఈ కోవలోకి చెందిందే ‘రాజమండ్రి రోస్ మిల్క్’. జై జాస్తి, అనంతిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి నాని బండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, పాటలు సినిమాపై మంచి అంచనాలే నెలకొల్పాయి. తాజాగా చిత్ర బృందం బిగ్ అప్డేట్ను ప్రకటించింది.
ఈ సినిమా టీజర్ డేట్ చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. రాజమండ్రి రోజ్ మిల్క్ టీజర్‌ను శుక్రవారం ఉదయం 10:20 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, ఇంట్రూప్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి 96 ఫేం గోవింద్ వసంత్ సంగీతం అందిస్తున్నాడు. ఈయనతో పాటుగా అజయ్ అరసాడ, యశ్వంత్ నాగ్, భరత్-సౌరభ్‌లు స్వరాలు సమకూరుస్తున్నారు. వెన్నెల కిషోర్ కీలకపాత్రలో నటించిన ఈ చిత్రానికి ప్రణీత్ ప్రట్టిపాటీ కథను అందించాడు.
Set your reminders🕦!!!
Rajahmundry Rosemilk teaser is releasing tomorrow @ 10:20 AM in YouTube and in theatres near you. Stay tuned!!! 💝#JaiJasti @Ananthika108 @vennelakishore @naanigadu@SureshProdns @introupe_films#RajahmundryRosemilk #RRMmovie pic.twitter.com/GPtsbND2BV— Maduri Mattaiah (@madurimadhu1) October 20, 2022