మహానటి సావిత్రి తొంభైయ్యవ జయంతి వేడుకలను రవీంద్రభారతిలో డిసెంబర్ 1 నుంచి 6వరకు ‘సావిత్రి మహోత్సవ్’ పేరిట నిర్వహించబోతున్నామని సావిత్రి కుమార్తె విజయచాముండేశ్వరి ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. కళాసంస్థ ‘సంగమం’ ఫౌండేషన్‌తో కలిసి నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో సావిత్రి సినిమాల ప్రదర్శన, పాటల పోటీలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు.
‘డిసెంబర్ 6న జరిగే జయంతి సభలో ‘మహానటి’ చిత్ర దర్శకనిర్మాతలు నాగ్అశ్విన్, ప్రియాంకదత్, స్వప్నాదత్లను, ‘సావిత్రి క్లాసిక్స్’ పుస్తక రచయిత సంజయ్ కిషోర్, ప్రచురణకర్త బొల్లినేని కృష్ణయ్యలను ప్రత్యేకంగా సత్కరిస్తున్నాము. మండలి బుద్ధప్రసాద్గారి అధ్యక్షతన జరిగే ఈ సభకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుగారు ముఖ్య అతిథిగా హాజరవుతారు’ అని విజయచాముండేశ్వరి తెలిపారు.