పతంగుల పోటీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘పతంగ్’. ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రణీత్ పత్తిపాటి దర్శకుడు. ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నది. శుక్రవారం ఈ సినిమా నుంచి ‘ఎమోషనల్ డ్రామా..’ అనే పాటను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డి.సురేష్‌బాబు మాట్లాడుతూ..పతంగుల పోటీ నేపథ్యంలో సరికొత్త కాన్సెప్ట్ ఇదని, నిర్మాణపరంగా ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కించారని ప్రశంసించారు. ఈ కథ అందరికి నచ్చుతుందని నిర్మాతల్లో ఒకరైన నాని బండ్రెడ్డి పేర్కొన్నారు. కొత్తవాళ్లతో తీసిన ఈ సినిమా యూత్ఫెస్టివల్గా ఆకట్టుకుంటుందని నిర్మాతలు పేర్కొన్నారు.