Raja Saab | టాలీవుడ్ దర్శకుడు మారుతి-గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కాంబోలో వస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ రాజాసాబ్ (Raja saab). హార్రర్ కామెడీ జోనర్లో వస్తున్న ఈ మూవీలో మాళవిక మోహనన్ (Malavika Mohanan), ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్, రిద్దికుమార్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్‌ను లాంచ్ చేశారు మేకర్స్.
కామెడీ, లవ్, రొమాన్స్, హార్రర్ లాంటి ఎలిమెంట్స్‌తో రాజాసాబ్ ఉండబోతుందన్నట్టు ట్రైలర్ హింట్ ఇచ్చేస్తుంది. మారుతి ప్రభాస్ నుంచి అభిమానులు ఆశించే అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ను సినిమాలో చూపించబోతున్నట్టు అర్థమవుతోంది. రాజాసాబ్ సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో ప్రభాస్ ఇంట్రో సాంగ్‌ను మారుతి టీం ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అక్టోబర్ 23న గ్రాండ్‌గా లాంచ్ చేయనుంది.
ఇప్పటికే లాంచ్ చేసిన రాజాసాబ్ గ్లింప్స్‌లో ప్రభాస్ సూపర్ స్టైలిష్‌గా చేతిలో పూలబొకే పట్టుకొని అద్దంలో తనను తాను చూసుకుంటూ.. పూలు చల్లుతూ నయా లుక్‌లో కనిపిస్తూ అభిమానులకు విజువల్ ట్రీట్ ఇస్తున్నాడు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. రాజాసాబ్‌లో సంజయ్ దత్ సంజూబాబా పాత్రలో కనిపించబోతున్నాడని తెలియజేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది.
రాజాసాబ్ ట్రైలర్..
The face of REBELLION…
now the face of ROYAL HORROR. #TheRajaSaab promising a spectacle that will send shivers across the globe from JAN 9th, 2026 💥💥💥#TheRajaSaabTrailer
— https://t.co/OQZXkLwbrZ#TheRajaSaabOnJan9th #Prabhas @DuttSanjay @DirectorMaruthi… pic.twitter.com/ZlPzWviGHm— People Media Factory (@peoplemediafcy) September 29, 2025
Pawan Kalyan | ఓజీ సినిమాలో పవన్ చిన్నప్పటి పాత్ర పోషించిన నటుడు ఎవరో మీకు తెలుసా?
Chiranjeevi | టీమిండియాకి చిరంజీవి, పవన్ కళ్యాణ్ ప్రత్యేక శుభాకాంక్షలు.. తెలుగు తేజంపై ప్రశంసలు
OTT | ఈ దసరాకి థియేటర్‌తో పాటు ఓటీటీలో ఫుల్ ఎంటర్టైన్మెంట్.. ఎన్ని సినిమాలు రాబోతున్నాయంటే!