Raja Babu|గోదావరి జిల్లాల నుండి ఇండస్ట్రీకి ఎందరో మహానుభావులు వచ్చారు. వారు తమ ప్రతిభతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే తెలుగు చలన చిత్రసీమలో నవ్వుల రేడుగా తన దైన ముద్రవేసుకున్న వారిలో అగ్రజుడు పుణ్యమూర్తుల అప్పలరాజు (హాస్యనటుడు రాజబాబు). పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో 1937 అక్టోబరు 20న జన్మించిన రాజబాబుకి బాల్యం నుంచి నాటకాలపై మక్కువ ఎక్కువ. ఇక సినిమారంగంపై ఉన్న ఆసక్తితో మద్రాసు వెళ్లాలని నిర్ణయించుకున్నపుడు రాజబాబుకి తన శ్రేయోబిలాషులు కానుమిల్లి చిట్టి బాబు, గండిపల్లి చిట్టిబాబు, వి.చిట్టిబాబు తది తరులు సాయం చేశారు.
ఇక తను సినీ జీవితంలోకి అడుగుపెట్టాక అప్పలరాజు పేరులో ఉన్న రాజుకు తన మిత్రుల పేర్లను జత చేసుకుని రాజబాబుగా మార్చేసుకున్నాడు. అలా వారిపై తన కున్న ప్రేమావాత్సల్యాలను చూపించారు రాజబాబు. నవ్వుల రారాజుగా వెలుగొందిన రాజబాబుకు భార్య, పిల్లలు ఉన్నారు. వారు సినిమారంగానికి దూరంగా ఉన్నారు. అమెరికాలో స్థిరపడ్డారు. రాజబాబు సోదరులు మాత్రం సినిమా రంగంలోనే ఉంటూ తమ కామెడీతో అలరిస్తూ వచ్చారు. రాజబాబు 1983 ఫిబ్రవరి 7న మరణించారు. అటుపై 2011 ఏప్రిల్ 9న రాజమహేంద్రవరం గోదావరి బండ్పై మాజీ ఎంపీ సినీనటుడు మాగంటి మురళీమోహన్ ప్రతిష్టాత్మకంగా రాజబాబు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే.
అయితే అప్పట్లో రాజబాబు డేట్స్ దొరికిన తర్వాతే ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి వాళ్లు కూడా డేట్స్ ఇచ్చేవారంటే రాజబాబుకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థమవుతుంది. హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ కూడా తీసుకునేవాడంటూ అప్పట్లో కొందరు చెప్పుకొచ్చేవారు.రాజబాబు దురదృష్టవంతుడు అని.. అప్పట్లో అంత సంపాదించి కూడా అనుభవించకుండా వెళ్లిపోయాడని బాధ పడ్డాడు ఆయన సోదరుడు చిట్టిబాబు.ఇండియాతో పాటు అమెరికాలోనూ వారికి ఆస్తులున్నాయని.. అక్కడ వాళ్ల సొంత సాఫ్వేర్ కంపెనీ పెట్టుకుని పిల్లలిద్దరూ హాయిగా సెటిల్ అయ్యారని కూడా చెప్పుకొచ్చాడు చిట్టిబాబు. కేవలం కంపెనీ విలువే 30 కోట్ల వరకు ఉంటుందని.. వాటితో పాటు మరికొన్ని ఆస్తులు కూడా ఉన్నట్టు స్పష్టం చేశారు. అయితే అంత సంపాదించిన రాజబాబు అనుభవించకుండా వెళ్లిపోయారని ఆయన తమ్ముళ్లు బాధపడుతూ ఉంటారు.