Director Ravi kumar Chowdary | ‘సినిమాను 200 థియేటర్లు విడుదల చేశాం. వస్తున్న స్పందన చూసి మరో 28 థియేటర్లు పెంచాం. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకదేవుళ్లకు ధన్యవాదాలు. సినిమా రిపోర్ట్, రిజల్ట్ బావున్నాయి. దర్శకుడు రవికుమార్‌చౌదరి చెప్పినదానికంటే గొప్పగా తీశారు. సాంకేతికంగా అన్ని విధాలా సినిమా బావుంది. అందుకే ఇంత మంచి స్పందన.’ అని మల్కాపురం శివకుమార్ అన్నారు.
రాజ్‌తరుణ్ హీరోగా ఏ.ఎస్.రవికుమార్‌చౌదరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తిరగబడరాసామి’. ఇటీవల సినిమా విడుదలైంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడారు. ‘సినిమాను ప్రేమించే నిర్మాత శివకుమార్. అడిగిన ఆర్టిస్టులను ఇచ్చారు. మంచి లొకేషన్స్ ఇచ్చారు. కోరిన టెక్నీషియన్స్‌ని ఇచ్చారు. సినిమాకోసం ఏదడిగినా కాదనలేదు. ఈ విజయానికి ప్రధాన కారణం ఆయనే’ అని రవికుమార్ చౌదరి అన్నారు. ఇంకా చిత్రయూనిట్ మొత్తం మాట్లాడారు.