రాజ్‌తరుణ్ అప్‌కమింగ్ మూవీ ‘భలే ఉన్నాడే’. జె.శివసాయివర్ధన్ దర్శకత్వంలో ఎన్వీ కిరణ్‌కుమార్ నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 7న విడుదల చేస్తున్నట్టు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. అనివార్యకారణాలవల్ల ఈ సినిమా విడుదలను ఓ వారం వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా న్యూ రిలీజ్ డేట్‌ని ప్రకటించారు.
ఈ నెల 13న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మనీషా కంద్కూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సింగీతం శ్రీనివాస్, అభిరామి, అమ్ము అభిరామి, లీలా శాంసన్, వీటీవీ గణేశ్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: నగేశ్ బానెల్లా, సంగీతం: శేఖర్‌చంద్ర.