Raj Tharun – Lavanya | టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్‌పై తాజాగా ఛార్జ్‌షీట్ దాఖలు అయింది. రాజ్ తరుణ్ తనని మోసం చేశాడంటూ అతని ప్రేయసి లావణ్య (lavanya) పోలీసులకు కంప్లయింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
అయితే ఈ కేసుకు సంబంధించి కొత్త మలుపు తీసుకుంది. దీనిపై విచారణ జరుపుతున్న పోలీసులు రాజ్‌తరుణ్‌ను నిందితుడిగా చేర్చి, ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. రాజ్ తరుణ్ – లావణ్య కలిసి పదేళ్లు ఒకే ఇంట్లో ఉన్నారని.. లావణ్య చెబుతున్న ఆరోపణల్లో నిజం ఉన్నట్లు దానికి సంబంధించి ఆమె ఇంటి వద్ద సాక్ష్యాలు కూడా సేకరించామని పోలీసులు తమ ప్రాథమిక విచారణలో తెలిపారు. ఈ కేసు విషయంలో లావణ్య చెప్తున్నదాంట్లో వాస్తవాలు ఉన్నాయని నార్సింగి పోలీసులు నిర్ధారించారు.
Also read..