Jinn | హార్రర్ థ్రిల్లర్ సినిమాలకు తెలుగులో ఆదరణ ఎక్కువేనని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇదే లైన్లో ప్రేక్షకులను భయపెట్టించేందుకు రాబోతుంది అమిత్ రావ్ హీరోగా నటిస్తోన్న జిన్ (Jinn). సస్పెన్స్ హార్రర్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ మూవీకి చిన్మయ్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. పర్వీజ్ సింబా, ప్రకారశ్ తుంబినాడు, రవి భట్, సంగీత, బాల్‌రాజ్ వాడి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ అయింది. ముహూర్తపు సన్నివేశానికి పెళ్లి చూపులు నిర్మాత రాజ్ కందకూరి క్లాప్ కొట్టగా.. ప్రముఖ గీత రచయిత సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి కెమెరా స్విఛాన్ చేశారు. రాజ్ కందూరి, రామజోగయ్య శాస్త్రి స్క్రిప్ట్‌ను అందజేశారు.
కన్నడ, తెలుగు బైలింగ్యువల్రా రాబోతున్న ఈ మూవీ మంచి విజయం అందుకోవాలని ఆశిస్తూ.. టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పారు రామజోగయ్య శాస్త్రి. ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. మంచి రైటర్ అయిన వరద్ రాజ్ కాంపౌండ్ నుంచి వస్తున్న ఈ సినిమాతో అమిత్ రావ్ హీరోగా మంచి పేరు తెచ్చుకోవాలని విష్ చేశారు.
The suspense horror thriller #Jinn launched with a grand pooja ceremony, motion poster also released
Clap by @IamRajKandukuri
Camera Switch On by @ramjowrites#AmitRao #ParvezSimba#ChinmayRam #NikhilMGowda #VaradarajChikkaballapur#SunilHonnalli #Alex #KeerthiRajD… pic.twitter.com/odjvtpm223— BA Raju’s Team (@baraju_SuperHit) December 8, 2024
Daaku Maharaaj | ఆ వార్తలే నిజమయ్యాయి.. అక్కడే బాలకృష్ణ డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్