సొలమన్ జడ్సన్, రాజ్‌బాలా, మనోచిత్ర, అనన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘రామ్ వర్సెస్ రావణ్’ చిత్రం గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కె.శుక్రన్ దర్శకుడు. డాక్టర్ ఏఎస్ జడ్సన్ నిర్మాత. పూజా కార్యక్రమానికి దర్శకుడు మారుతి ముఖ్యఅతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌నిచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇదొక పల్లెటూరి కథ. ఓ ఊరి మంచి కోసం ఇద్దరు యువకులు ఎలాంటి పోరాటం చేశారన్నది ఆసక్తికరంగా ఉంటుంది. యాక్షన్‌తో పాటు వినోద అంశాలు అలరిస్తాయి’ అన్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రాజామతి, సంగీతం: వికాస్ బాడిశ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.శుక్రన్.