Raid 3 | బాలీవుడ్లో అత్యంత విజయవంతమైన క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలలో ఒకటైన ‘రైడ్’ మూడో భాగం అధికారికంగా ప్రారంభమైంది. అజయ్ దేవగణ్ హీరోగా, రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వంలో వచ్చిన రైడ్ (2018), రైడ్ 2 (2025) రెండు భారీ విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అభిమానులు ఆశించినట్లుగానే ‘రైడ్ 3’ స్క్రిప్ట్ సిద్ధం అవుతున్నట్లు మేకర్స్ ప్రకటించి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. కొత్త భాగంలోనూ పెద్దగా మార్పులు చేయకుండా అజయ్ దేవగణ్–రాజ్‌కుమార్ గుప్తా కాంబినేషన్ కొనసాగుతుంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, రాజ్‌కుమార్ గుప్తా ఈసారి మరింత బలమైన కథ, ఇంటెన్స్ నరేషన్తో సిద్ధమవుతున్నాడు.
అజయ్ దేవగణ్ మరోసారి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పాత్రలోనే కనిపించనున్నాడు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వేగంగా జరుగుతోంది. ఫ్రాంచైజీలో ఇప్పటివరకు ఇద్దరు స్టార్ హీరోయిన్లు కనిపించారు . రైడ్ చిత్రంలో ఇలియానా, రైడ్ 2లో వాణీ కపూర్ కనిపించగా, వారి పాత్రలకి మంచి ఆదరణ లభించాయి. ఇప్పుడు ‘రైడ్ 3’లో హీరోయిన్గా ఎవరిని ఎంపిక చేస్తారనే ఉత్కంఠ పెరిగింది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక గత సిరీస్‌లో ముఖ్య పాత్రలు పోషించిన రితేష్ దేశ్‌ముఖ్, సౌరభ్ శుక్లా, సానంద్ వర్మ లాంటివారి రీ-ఎంట్రీపై కూడా చర్చ నడుస్తోంది. సపోర్టింగ్ క్యాస్ట్ బలమైనది కావడంతో, మేకర్స్ వారిని కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
గత రెండు భాగాలకు సంగీతం అందించిన అమిత్ త్రివేది ని మూడో భాగానికి కూడా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉందని టాక్. ప్రస్తుతం అజయ్ దేవగణ్ మరో రెండు పెద్ద చిత్రాల్లో నటిస్తున్నాడు .ధమాల్–4 షూటింగ్ పూర్తై, పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా, రేంజర్ షూటింగ్ జరుగుతోంది. ఈ రెండు కూడా వచ్చే ఏడాదిలో రిలీజ్ కావచ్చు. ఆ తరువాతే ‘రైడ్ 3’ ఫ్లోర్ మీదికి వెళ్లే అవకాశం ఉంది. మొత్తానికి, ‘రైడ్ 3’ అనౌన్స్మెంట్తోనే బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ ప్రపంచం మళ్లీ ఉత్సాహంతో నిండింది.అజయ్ దేవగణ్ పవర్ఫుల్ రోల్, రాజ్‌కుమార్ గుప్తా గ్రిప్పింగ్ మేకింగ్ మూడో భాగంపై భారీ అంచనాలు మొదలయ్యాయి.