Rahul Sipligunj | టాలీవుడ్ ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మాస్ బీట్లతో కుర్రకారును అలరించే రాహుల్, ‘నాటు నాటు’ పాటతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ పాటకు ఆస్కార్ దక్కడంతో భారతీయ సంగీతానికి అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రతిష్ట లభించింది. ప్రస్తుతం కూడా రాహుల్ పలు స్టార్ సినిమాల కోసం సాంగ్స్ పాడుతూ బిజీగా కొనసాగుతున్నాడు. ఇటీవల రాహుల్ తన ప్రేయసి హరిణ్య రెడ్డిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా రిలేషన్లో ఉన్న ఈ జంట, హైదరాబాద్‌లో జరిగిన గ్రాండ్ సెలబ్రేషన్లో ఏడడుగులు వేసారు. సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్న ఈ పెళ్లి వేడుక సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యింది.
వెడ్డింగ్ రిసెప్షన్ తరువాత కొత్త జంట హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లారు. బీచ్‌లు, నీలి ఆకాశం, పారదర్శక నీళ్ల మధ్య ఈ జంట రొమాంటిక్‌గా ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. నీళ్లలో హరిణ్యను తదేకంగా చూస్తూ రాహుల్ కనిపించాడు. ఈ క్లిక్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ పిక్‌పై “క్యూట్ కపుల్”, “గోల్స్”, “పర్పెక్ట్ మ్యాచ్” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మాల్దీవ్స్‌లో వీళ్ల లవ్ కెమిస్ట్రీ అదుర్స్ అంటున్నారు. ఫోటోలు షేర్ అవుతున్న వేగమే చూస్తుంటే, ఈ జంట హనీమూన్ మూడ్ ఫుల్ ఆన్ ట్రెండ్‌లో ఉందని చెప్పాలి.కొత్త జీవితాన్ని ఆరంభించిన రాహుల్–హరిణ్యకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ, మరిన్ని క్యూట్ ఫోటోస్ కోసం ఎదురు చూస్తున్నారు.
ఇటీవల రాహుల్ లవ్ స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది. వీరిద్దరు మొదట ఎక్కడ కలుసుకున్నారనే విషయం వైరల్ కాగా, రాహుల్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. `బిగ్ బాస్` షోలోనే ఆమెని కలిశాడట. హరిణ్య బిగ్ బాస్ షో ప్రొడక్షన్ కంపెనీ అయిన ఎండేమోల్ షైన్ ఇండియాలో ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్‌గా పనిచేసింది. ఆ టైమ్‌లోనే రాహుల్‌తో పరిచయం ఏర్పడిందని, అది ప్రేమగా మారిందట. కాగా, 2019లో రాహుల్ బిగ్ బాస్ తెలుగు 3 షోలో పాల్గొని విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.