స్టార్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ మెగా ఫోన్ పట్టనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్(ట్విటర్)లో శనివారం ఉదయం ఆయన పోస్ట్ పెట్టారు. పైగా ఈ చిత్రాన్ని ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్నారట. ఈ మేరకు రాహుల్ రామకృష్ణ ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు.
ఇందులో భాగంగా తను దర్శకత్వం వహించనున్న తొలి చిత్రానికి సంబంధించిన నటీనటుల ఎంపిక కూడా మొదలుపెట్టారాయన. ‘దర్శకుడిగా తొలి ప్రయత్నం చేస్తున్నా. మీలో ఎవరికైనా ఇంట్రస్ట్ ఉంటే మీ షోరీల్స్, ఫొటోలను నాకు మెయిల్ చేయండి.’ అని తన పోస్ట్‌లో రాహుల్ రామకృష్ణ పేర్కొన్నారు.