టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కాంస్య పతకం గెలుపొందిన సంగతి తెలిసిందే. మహిళల సింగిల్స్‌లో భాగంగా చైనాకి చెందిన హి బింగ్జియావోతోకాంస్య పతక పోరులో తలపడిన పీవీ సింధు 21-13, 21-15 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలుపొందిన పీవీ సింధు.. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకం సాధించిన షట్లర్‌గా రికార్డ్ నెలకొల్పింది.
రెండు సార్లు ఒలంపిక్ పతకం సాధించిన తెలుగు అమ్మాయిని పలువురు ప్రముఖులు సత్కరిస్తూ వస్తున్నారు. తాజాగా చిరంజీవి .. పీవీ సింధుని సత్కరించగా ఈ వేడుకలో రాధిక, సుహాసినితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.అయితే ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, నటులు చిరంజీవితో కలిసి దిగిన ఫొటోలని తన ట్విట్టర్ లో షేర్ చేసిన రాధికా.. మిత్రుడు చిరంజీవి.. సింధును సత్కరించే వేడుకలో పాల్గొనడం గొప్ప అనుభూతిని పంచింది.
అయితే రాధిక ట్వీట్లో చిన్న తప్పిదం దొర్లడంతో ఆమెపై విమర్శలు చేశారు నెటిజన్స్. ‘పసిడి పతకం గెలుచుకోవడం ఎంత గొప్ప అనుభూతి! దేశం కోసం పోరాడి పతకం సాధించింది’ అంటూ రాధిక తన ట్వీట్ లో పేర్కొన్నారు. అంతేకాదు, ఒలింపిక్ గోల్డ్ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టారు. దీనిపై బాగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో మళ్లీ ట్వీట్ చేసింది. ఆ కాంస్య పతకమే బంగారు పతకం కంటే గొప్పది.. పీవీ సింధులోని ఆ ఫీలింగ్స్, ఆమె సంతోషమే అది తెలియజేస్తోంది అని ట్రోలర్లకు సమాధానం ఇచ్చారు రాధికా. అయితే ఈ ఈవెంట్ ఎక్కడ జరిగిందనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
Proud to meet @Pvsindhu1 felicitated by good humanitarian and friend @KChiruTweets , what a feeling holding the gold which she has battled and won well for our country #pvsindhu #Olympics2020 #OlympicGold pic.twitter.com/cPRoUyeBep
— Radikaa Sarathkumar (@realradikaa) August 20, 2021
The bronze, which is more than gold💪🏻💪🏻💪🏻💪🏻❤️❤️❤️❤️@Pvsindhu1 the feeling says it all pic.twitter.com/PKdolFiNch
— Radikaa Sarathkumar (@realradikaa) August 21, 2021