Radhika| అలనాటి అందాల తార రాధిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరంజీవితో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన రాధిక ఆ తర్వాత సపోర్టింగ్ క్యారెక్టర్స్ పోషిస్తుంది. దివంగత నటుడు ఎం.ఆర్. రాధ కుమార్తె అయితన రాధిక శరత్‌కుమార్. దర్శకుడు భారతి రాజా దర్శకత్వంలో 1978లో విడుదలైన తమిళ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. కేవలం 2 సంవత్సరాలలోనే ఆమె స్టార్ హీరోయిన్ గాఎదిగిన ఈ భామ కథా ప్రాధాన్యత ఉన్న చిత్రాలలో నటించి మెప్పించింది. తమిళం, తెలుగు భాషలలో అద్భుతమైన నటనతో మెప్పించిన రాధిక చాలా మంది ప్రముఖ నటులకు తల్లిగా కూడా నటించారు.
తన భర్త శరత్‌కుమార్‌కు భార్యగా – తల్లిగా ‘సూర్య వంశం’ సినిమాలో రాధిక నటించడం విశేషం. 90వ దశకంలో అగ్ర నటులుగా ఉన్న విజయ్, రవితేజ, శర్వానంద్, అజిత్, ప్రశాంత్ వంటి నటులకు కూడా చాలా సినిమాల్లో తల్లిగా నటించారు. సినిమాలోనే కాకుండా సీరియల్స్‌లో కూడా నటించిన నటి రాధిక… నిర్మాత, వ్యాఖ్యాతగా కూడా అలరించారు. అయితే రాధిక మహిళా దినోత్సవం సందర్భంగా షాకింగ్ పోస్ట్ పెట్టింది. ఇటీవల ఓ షూటింగ్ లో తన మోకాలికి గాయమైందని , ఎన్ని మందులు వాడినా, ఎన్నోరకాల చికిత్సలు చేయించుకున్నా ప్రయోజనం కనిపించలేదంటూ చెప్పుకొచ్చింది.
అనేక థెరపీలు తీసుకున్నా కూడా నొప్పి తగ్గలేదు. చివరికి శస్త్ర చికిత్స చేయించుఏకున్నాను. శస్త్రచికిత్స సమయంలో తన భర్త శరత్ కుమార్ తనను ఓ పసిపాపలా చూసుకున్నాడు. భర్త మద్దతును మరువలేను అంటూ రాధిక పేర్కొంది. అయితే మహిళలు ఎప్పుడూ మనోధైర్యం కోల్పోకూడదని, ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా నిలబడాలంటూ కూడా రాధిక స్పష్టం చేసింది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళ తన గురించి, తనను తాను గొప్పగా మెరుగుపరచుకోవడం గురించి, మిమ్మల్ని మీరు ఎక్కువగా ప్రేమించుకోవడం గురించి, మీ జీవితాన్ని అభినందించడం గురించి శ్రద్ధ వహించాలని నేను కోరుకుంటున్నాను అంటూ రాధిక స్పష్టం చేసింది.