Radheshyam | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలి సినిమాతో ప్రపంచమంతా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాందించుకున్నాడు. టాక్‌తో సంబంధంలేకుండా ఈయన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ సునామీని సృష్టిస్తాయి. ప్రస్తుతం ఈయన వరుస పాన్ఇండియా సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన రాధేశ్యామ్ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
యూవీ క్రియేషన్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రానికి జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు టీజర్, పాటలు ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచుతున్నాయి. ఈ క్రమంలోనే రాధేశ్యామ్ చిత్రం దాదాపు పదివేలకు పైగా స్క్రీన్లలో విడుదలకానున్నట్లు సమాచారం. కేవలం అమేరికాలోనే 2000 థియేటర్లలో ఈ చిత్రం విడుదలకానున్నట్లు తెలుస్తుంది. ఇక నార్త్‌లో ఈ చిత్రం 4000 స్రీన్లలో ప్రదర్శితమౌతుందని సమాచారం. ప్రభాస్‌కున్న క్రేజ్,సినిమాపైన ఉన్న నమ్మకం వల్లే ఆ స్థాయిలో థియేటర్లలో రాధేశ్యామ్ చిత్రాన్ని విడుదలచేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో కృష్ణంరాజు కీలకపాత్రలో నటించనుండగా పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది.
ప్రస్తుతం ప్రభాస్ సలార్‌ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఇక ఈ చిత్రానికి డిజిటల్ రైట్స్ అన్ని భాషలకు కలిపి 200 కోట్ల భారీ ధరకు ప్రముఖ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసిందని సమాచారం. ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. నాగ్అశ్విన్ రూపొందిస్తున్న ప్రాజెక్ట్-K షూటింగ్ దశలో ఉంది. వీటితో పాటుగా సందీప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న స్పిరిట్ స్క్రీప్ట్ దశలో ఉంది.