Radha Madhavam | టాలీవుడ్ యువనటులు వినాయక్ దేశాయ్, అపర్ణా దేశాయ్ జంటగా రూపుదిద్దుకొంటున్న ప్రేమకథా చిత్రం ‘రాధామాధవం’ (Radha Madhavam). ఈ సినిమాకు దాసరి ఇస్సా దర్శకత్వం వహిస్తుండగా.. గోనాల్ వెంకటేశ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా మార్చి 01న విడుదల కానుండగా ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు ట్రైలర్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. చక్కని సందేశాత్మక చిత్రమని సినిమా మీద ప్రశంసలు కురిపించారు. మార్చి 1న ఈ మూవీ భారీ ఎత్తున విడుదల కానుంది.
జయ ప్రకాష్, ప్రియ, నవీన్, రవి శివతేజ, సుమన్, రాచర్ల లాస్య, ధనుష్ ఆచార్య, రాచర్ల మహేష్, శ్రీకాంత్ పర్కాల, సతీష్ కొల్లిపల్లి, శ్రీను, అడెపు మణిదీప్, చిరంజీవి, కామనగరి జ్యోతి, సురభి శ్యామల తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు గోనాల్ వెంకటేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు