కెరీర్ ఆరంభంలో తెలుగులో విజయాలతో పాటు యువతలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది పంజాబీ భామ రాశీఖన్నా. అయితే గతకొన్నేళ్లుగా ఈ సొగసరికి విజయాలు కరువయ్యాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ మంచి హిట్ కోసం నిరీక్షిస్తున్నదీ భామ. తాజా సమాచారం ప్రకారం పవన్‌కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రంలో ఈ సొగసరి రెండో నాయికగా ఖరారైనట్లు వార్తలొస్తున్నాయి.
హరీశ్‌శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నది. కథాప్రకారం రెండోనాయికకు కూడా చోటుందట. అందుకోసం పలువురు నాయికలను పరిశీలించిన చిత్రబృందం చివరకు రాశీఖన్నాను ఖరారు చేశారని సమాచారం. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ షూటింగ్ కొద్దిరోజుల క్రితమే పునఃప్రారంభమైంది. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఇక రాశీఖన్నా ప్రస్తుతం తెలుగులో ‘తెలుసుకదా’ అనే చిత్రంలో నటిస్తున్నది.