Raashii Khanna | ‘ఊహలు గుసగుసలాడే’తో హీరోయిన్గా పరిచయమై ‘జిల్’తో కమర్షియల్ హీరోయిన్గా ఎదిగి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్స్‌లో ఒకరిగా ఎదిగింది రాశీఖన్నా. అయితే, ఈ మధ్య తాను నటించిన సినిమాలు పెద్దగా ఆడకపోవడం వల్లే అనుకుంట.. తమిళబాట పట్టిందీ ఢిల్లీ బ్యూటీ. అక్కడ అవకాశాలను బాగానే రాబట్టుకుంటున్నది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఓ మూడ్నాలుగు తమిళ సినిమాలున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమిళ పరిశ్రమపై ఆసక్తికరంగా మాట్లాడింది రాశీఖన్నా ‘
‘తమిళ పరిశ్రమలో ఫస్ట్ ప్రయారిటీ టాలెంట్‌కి ఇస్తారు. సెకండ్ ప్రయారిటీ అందానికిస్తారు. కేరక్టర్‌కి కరెక్ట్ అనుకుంటే సక్సెస్ గురించి కూడా ఆలోచించరు. దేశంలోని మిగతా పరిశ్రమలతో పోలిస్తే ఇది చాలా భిన్నమైన పరిశ్రమ అని చెప్పాలి. నాకు లైఫ్ ఇచ్చింది తెలుగు సినిమా అయితే, నటిగా నా ఆకలి తీరుస్తుంది మాత్రం తమిళ సినిమానే. ఇక్కడ మంచి పాత్రలు దొరుకుతున్నాయి.’ అంటూ ఆనందం వ్యక్తం చేసింది రాశీఖన్నా.