నటీనటుల ముఖాలు చూపించకుండా కేవలం కథ, కథనాలు ప్రధానంగా ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘రా రాజా’.శ్రీపద్మిని సినిమాస్ పతాకంపై బి.శివప్రసాద్ తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 7న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం ఈ సినిమా పోస్టర్‌ను నటుడు జేడీ చక్రవర్తి విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..ముఖాన్ని చూపించకుండా ప్రేక్షకుల్ని భయపెట్టడం మామూలు విషయం కాదని, కొత్త కాన్సెప్ట్‌తో సినిమా తీశారని యూనిట్‌ను అభినందించారు. సూపర్నాచురల్ థ్రిల్లర్ కథాంశమిదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రాహుల్ శ్రీవాత్సవ్, సంగీతం: శేఖర్‌చంద్ర, దర్శకత్వం: బి.శివప్రసాద్.