R. Narayana Murthy | పీపుల్స్‌స్టార్, అభ్యుదయ చిత్రాల రూపకర్త, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి హాస్పిటల్ నుంచి శనివారం డిశ్ఛార్జి అయ్యారు. గత బుధవారం స్వల్ప అస్వస్థతకు లోనయిన ఆయన హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. కాగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడడంతో హాస్పిటల్ నుంచి డిశ్ఛార్జి అయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయనకు వైద్యం అందించిన డాక్టర్, హాస్పిటల్ స్టాఫ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
అంతకుముందు అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్.నారాయణమూర్తిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఉదయం ఫోన్లో పరామర్శించారు. ఆర్ నారాయణ మూర్తికి అన్ని విధాలుగా అండగా ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. దశాబ్దాలుగా హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా విప్లవ సినిమాలతోపాటు సామాజిక నేపథ్యం ఉన్న సినిమాలు తెరకెక్కిస్తూ పీపుల్స్ స్టార్‌గా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు ఆర్ నారాయణమూర్తి.
Also Read..