ప్రఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా విడుదలై మూడేళ్లు నిండి, నాలుగో యేడు నడుస్తున్నది. ప్రస్తుతం ఆయన మహేశ్‌బాబు కథానాయకుడిగా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇదో ట్రెజర్ హంట్ నేపథ్యంలో సాగే సాహసయాత్ర. ఈ చిత్రంలో మహేశ్‌కి జోడీగా ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. మలయాళ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ ఇందులో విలన్‌గా కనిపించనున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్‌లోకి మల్టీటాలెంటెడ్ యాక్టర్ మాధవన్ వచ్చి చేరారట. త్వరలోనే ఆయన ఈ సినిమా షూటింగ్లో జాయిన్ కానున్నారు. మరి ఇందులో మాధవన్ పోషించే పాత్ర ఏమిటి? అనేది తెలియాల్సివుంది. దాదాపు 600కోట్ల భారీ నిర్మాణ వ్యయంతో దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి స్వరకర్త. ఈ చిత్రానికి మాటలు: దేవకట్టా.