Prashanth Varma | టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ప్రశాంత్వర్మ (Prashanth Varma) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారాడు. ఈయన దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘జై హనుమాన్’ (Jai Hanuman). గతేడాది ‘హనుమాన్’తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ దర్శకుడు ప్రస్తుతం దీనికి సీక్వెల్ ‘జై హనుమాన్’ తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. అయితే ఈ సినిమాతో పాటు నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు ప్రశాంత్ వర్మ.
అయితే ఈ రెండు సినిమాలు కాకుండా తన సినిమాటిక్ యూనివర్స్ తాజాగా మరో సినిమా అప్డేట్ ఇచ్చాడు. అక్టోబర్ 10న ఇందుకు సంబంధించిన అనౌన్స్ ఇవ్వనున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించాడు. ఇక ఈ సినిమా పేరు ఏమిటి, ఇందులో నటించే నటీనటులు ఎవరు అన్న విషయాలు గురువారం తెలియనుంది. ఈ నవరాత్రికి శక్తి మాయాజాలాన్ని చూసేందుకు అలాగే వీక్షించడానికి సిద్ధంగా ఉండండి! అంటూ ప్రశాంత్వర్మ రాసుకోచ్చాడు.
This Navratri, get ready to witness and behold the power and magic! 🔥⚜️
Let’s keep this journey going, and I hope you’re as excited as I am for what’s to come. ❤️🔥@ThePVCU pic.twitter.com/pLU0EOUe8q
— Prasanth Varma (@PrasanthVarma) October 8, 2024