తన సినిమాలను అద్భుతంగా ప్రచారం చేయడంలో రాజమౌళిని మించిన వారు లేరు. ఆయన చేస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ జనవరి 7న విడుదల కానుంది. “ఆర్ఆర్ఆర్”ను దేశవ్యాప్తంగా విడుదల చేయడానికి మల్టీప్లెక్స్ దిగ్గజం పివిఆర్ సినిమాస్‌తో చేతులు కలుపుతున్నారు మేకర్స్.
ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయం సృష్టించిన ఆర్ఆర్ఆర్ బృందం పీవీఆర్ సంస్థతో డీల్ కుదుర్చుకుంది. PVR సినిమాస్‌కి సంబంధించిన అన్ని మల్టీప్లెక్స్‌ల పేరు PVRRR గా మార్పు చేశారు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ వరకు PVR సినిమాస్ PVRRR గా కనపడనుంది. ఇండియన్ సినిమా హిస్టరీలో ఇదొక రికార్డ్ అని సినీ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇతర దిగ్గజ మల్టీప్లెక్స్ లతో కూడా “ఆర్ఆర్ఆర్” టై అప్ అవ్వబోతోందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేయనుందని సమాచారం.
#PVRRR…. 🔥🌊 #RRRMovie
— RRR Movie (@RRRMovie) October 29, 2021
For the first time ever in the world, a brand changed their name for the film… For RRR… 🤟🏻
it will be referred as PVRRR for next few months across India in 850+ screens and 170+ properties in 70+ cities… pic.twitter.com/TtcOUSAteL